అప్పుడు ఫిలిఫీన్స్ అధ్యక్షుడి మెడలో….ఇప్పుడు శశిథరూర్ మెడలో!

-

గత ఏడాది(2019) అక్టోబరు మూడో వారంలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫిలిప్పీన్స్‌లో అయిదు రోజులు పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కోవింద్, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్ట్ భేటీ అయినప్పుడు మీడియా కు కొన్ని ఫోటోలు రిలీజ్ చేయగా ఆ ఫోటోలలో రోడ్రిగో మెడ లో ఒక వస్తువు కనిపించింది. అయితే అప్పుడు అందరూ కూడా ఏంటా వస్తువు అది ఆయన ఎందుకు మెడలో వేసుకున్నారు అని అందరూ అనుకున్నారు. ఇంతకీ ఆ గ్యాగేట్ ఏంటంటే ఎయిర్ టేమర్, అది ఒక ఎయిర్ ప్యూరిఫయర్ అని.. జలుబు, దగ్గు ఉన్నవారెవరైనా తన చుట్టూ ఉంటే వారి నుంచి వైరస్, బ్యాక్టీరియా అధ్యక్షుడికి సోకకుండా ఇది కాపాడుతుందని సాల్వడార్ పానెలో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఇప్పుడు శశిథరూర్ మెడలో కూడా ఈ ఎయిర్ టేమర్ దర్శనమిస్తుంది. కొద్ది నెలలుగా శశి థరూర్ ఆ గాడ్జెట్ లేకుండా బయటకు అడుగుపెట్టడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలకూ ఆయన ఈ గాడ్జెట్ మెడలో వేసుకునే హాజరువుతున్నారు. చూడ్డానికి సెల్‌ఫోన్‌లా కనిపిస్తున్న ఈ గాడ్జెట్‌ కొందరైతే ఏకంగా ఆయన్నే అడుగుతున్నారు సోషల్ మీడియాలో. దానికి ఆయన సమాధానం ఇచ్చారు కూడా.

ఒక్క మాటలో చెప్పాలంటే పర్సనల్ ఎయిర్‌ప్యూరిఫయర్. దీన్ని తయారుచేసిన సంస్థ పేరుతో ఎయిర్ టేమర్ అని కూడా అంటారు. అంటున్నారు. పెరుగుతున్న వాయుకాలుష్య ప్రభావం నుంచి రక్షించుకోవడానికి ఇటీవల కాలంలో ఇళ్లలో, ఆఫీసుల్లో, చివరికి కార్లలో కూడా ఎయిర్‌ప్యూరిఫయర్ల వాడకం పెరిగింది. కానీ ఇతర దేశాలకు,దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడో, బహిరంగ ప్రదేశాలకు వెళ్తున్నప్పుడో ఈ ఎయిర్‌ప్యూరిఫయర్లను వెంట తీసుకెళ్లడం కుదరదు కదా. ఆ సమస్యకు పరిష్కారమే ఈ ఎయిర్ టేమర్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version