ఓలాతో ఒప్పందం చేసుకున్న పేటీఎం

-

డిజిటల్‌ సేవలను అందిస్తున్న పేటీఎం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. రిటైల్‌ విభాగంలోకి తమ సేవలను విస్తరించేందుకు NUEలాతో ఒప్పందం చేసుకున్నట్లు పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ మంగళవారం తెలిపారు. డిజిటల్‌ చెల్లింపుల విభాగంలో అవకాశాలు విస్తరిస్తున్న సందర్భంగా ఈ సేవల్లో ఓలాను కీలకమైన భాగస్వామిగా చేర్చుకున్నామని తెలిపారు. దీనికోసమే NUE కోసం రిజర్వు బ్యాంకుకు దరఖాస్తు చేస్తున్నామని వివరించారు. ఈ కన్సార్టియంలో ఒక బ్యాంకు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, పేమెంట్స్‌ బ్యాంక్, ఫిన్‌ టెక్‌ కంపెనీ, టెక్‌ కంపెనీ, ఎన్‌బీఎఫ్‌సీ ఉంటాయని శర్మ చెప్పారు. కానీ ఈ అంశంపై ఓలా అధికారికంగా స్పందించాల్సి ఉంది.

NUE అంటే రిటైల్‌ రంగంలో చెల్లింపుల కోసం ఏర్పాటు చేసుకునే కంపెనీలను న్యూ అంబరెల్లా ఎంటిటీలు లేదా NUE అంటారు. వీటి ఏర్పాటుకు సంబంధించిన నియమాలు కంపెనీస్‌ యాక్ట్‌– 2013, పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్‌ యాక్ట్‌–2007.. వంటి చట్టాల్లో ఉన్నాయి. NUE ఆధార్‌ బేస్డ్‌ పేమెంట్‌ సిస్టమ్, రెమిటెన్స్‌ సేవలు, కొత్త చెల్లింపుల విధానాలు వంటి ఎన్నో సేవలను అందిస్తాయి. దేశంలో రిటైల్‌ పేమెంట్స్‌ కోసం ప్రత్యేకంగా ఈ ఎంటిటీలను ఏర్పాటు చేసుకోవచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ గత ఏడాది ప్రకటించింది. 2020 ఆగస్టులో దీనికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను విడుదల చేసింది. NUE ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకు 2021 ఫిబ్రవరి 26 వరకు గుడువు ఇచ్చింది. కరోనా కారణంగా తుది గడువును పొడిగించాలని చాలా సంస్థలు ఆర్‌బీఐని కోరాయి. దీంతో సెంట్రల్‌ బ్యాంక్‌ NUE కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును మార్చి 31 వరకు పొడిగించింది.

వివిధ రకాల సంస్థలు కలిసి ఒక కన్సార్టియంగా ఏర్పడి NUE లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. టాటా గ్రూపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కొటక్‌ మహీంద్రా బ్యాంక్, మాస్టర్‌ కార్డ్, భారతీ ఎయిర్‌టెల్‌ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news