పేటీఎం ఎండీ రూ.11 కోట్ల షేర్లను 1.7 లక్షల కోట్లకే కొన్నారట..

-

పేటీఎం ఎండీ విజయశేఖర శర్మ తన కంపెనీ షేర్లను తిరిగి కొనుగోలు చేశారు. ఇందులో వింతేం ఉంది అంటారా.. రూ.2150కి అమ్మిన షేర్లను కేవలం రూ.640కే కొన్నారట. అంటే ఓపెన్ మార్కెట్ లో రూ.11 కోట్ల విలువైన షేర్లను.. రూ.1.7 లక్షల కోట్లకే కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని సెబీ వెల్లడించింది.  రూ.6.31 కోట్లతో 100,552 షేర్లు, మే 31న రూ.4.68 కోట్లతో 71,469 షేర్లను ఆయన కొన్నారు.

 

గతేడాది నవంబర్ లో పేటీఎం ఐపీవోకు వచ్చింది. నిబంధనల ప్రకారం ఇష్యూకు వచ్చిన ఆరు నెలల వరకు కంపెనీ యాజమాన్యం తమ షేర్లను కొనుగోలు చేయకూడదు. ఈ గడువు ముగియడంతో విజయ శేఖర శర్మ షేర్లను కొన్నారు. మరో ఆరు నెలల్లో పేటీఎం ఎబిటా బ్రేక్‌ ఈవెన్‌ అవుతుందని మార్చిలో ఆయన షేర్‌హోల్డర్లతో చెప్పారు. అభివృద్ధి ప్రణాళికల విషయంలో ఏ మాత్రం రాజీ పడబోమని స్పష్టం చేశారు. పేటీఎం షేర్లను కొనుగోలు చేయొచ్చని ఈ మధ్యే గోల్డ్‌మన్‌ సాచెస్‌ సైతం రికమెండ్‌ చేయడం గమనార్హం.

భారత్‌లోని అతిపెద్ద ఐపీవోల్లో ఒకటిగా పేటీఎం నిలిచింది. రూ.2,150ను ఇష్యూ ధరతో మార్కెట్లో నమోదైంది. ఈ ఫిన్‌టెక్‌ కంపెనీ వాల్యుయేషన్స్‌ ఎక్కువగా భావించడంతో ఆ తర్వాత షేర్ల ధర పతనమైంది. కొన్ని రోజుల క్రితం రూ.511 వద్ద ఆల్‌టైం కనిష్ఠాన్ని నమోదు చేసింది.  రూ.613 వద్ద ఓపెనై రూ.32 లాభంతో రూ.646 వద్ద ముగిసింది. పేటీఎం షేరు మే 30న రూ.630, మే 31న రూ.652 వద్ద ముగిసింది. రూ.640ని సగటు ధరగా తీసుకున్నా పేటీఎం సీఈవోకు ఒక్కో షేరుపై రూ.1510 లాభం వచ్చినట్టే! మొత్తంగా రూ.11 కోట్లు లాభం.

Read more RELATED
Recommended to you

Latest news