పునీత్ రాజ్ కుమార్ ఇంటికి ఏపీ మంత్రి

-

కన్నడ పవర్ స్టార్ట్ పునీత్ రాజ్ కుమార్ గారి కుటుంభ సభ్యులను పరామర్శించారు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇవాళ ఉదయం బెంగుళూరు కు వెళ్లిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్వినిని పరామర్శించారు. పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చాలా బాధించింది అని ఈ సందర్భంగా పేర్కొన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

చిన్న వయస్సు లో అనేక మంచి కార్యక్రమాలు చేసి ఎంతో మందిని ఆదుకున్న గొప్ప మానవతావాది పునీత్ గారు అని గుర్తు చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన మృతి చిత్ర పరిశ్రమ తో పాటు సామాజిక కార్యక్రమాలకు తీరని లోటని వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు పెద్ది రెడ్డి. కాగా.. ఇటీవలే కన్నడ పవర్ స్టార్ట్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటు తో మరణించిన సంగతి తెలిసిందే. జిమ్ చేస్తుండగా ఆయన మృతి చెం దారు.

Read more RELATED
Recommended to you

Latest news