పతనం అంటే ఏమిటో చంద్రబాబుకి అర్థమై వుంటుంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

-

చంద్రబాబు ను అరెస్ట్ చేసిన అనంతరం వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారు. చంద్రబాబు తన హయాంలో అవినీతి చేసి దొరకములే అనుకున్నాడు.. కానీ ఇప్పుడు చంద్రబాబు పని అయిపోయింది,. ఇక ఊచలు లెక్కపెట్టుకోవలసిందే అంటూ కామెంట్ లు చేస్తున్నారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ స్కిల్ కేసులో టెక్నికల్ అంశాల గురించి చెబుతున్న చంద్రబాబు, తాను తప్పు చేయలేదని చెప్పలేకపోతున్నాడంటూ గుర్తు చేశారు. ఇంతకాలం వరకు కోర్ట్ లనుండి స్టే లు తెచ్చుకుంటూ తప్పించుకుంటూ వచ్చాడని, కానీ ఇప్పుడు స్టే లతో పని లేదని మంత్రి చెప్పారు. ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు కు అసలైన పతనం ఎలా ఉంటుందో అర్ధం అవుతుందని ఎమోషనల్ గా దెబ్బ తీసేలా మాట్లాడారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి.

చట్టం ఎవరికీ చుట్టం కాదని… తన పని తాను చేసుకుంటూ పోతుందని మంత్రి మాట్లాడారు. ఇక టీడీపీ ఈ రోజు ప్రకటించిన రాష్ట్ర బంద్ గురించి ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరని మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news