గుడ్ న్యూస్ : స్టార్ట్ అయిన ఇండియా VS పాకిస్తాన్ మ్యాచ్ !

-

షెడ్యూల్ ప్రకారం నిన్ననే పూర్తి కావాల్సిన ఇండియా మరియు పాకిస్తాల్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కాస్తా .. వర్షం కారణంగా ఈ రోజుకు వాయిదా పడింది. కానీ ఈ రోజు కూడా ఉదయం నుండి వర్షం పడుతుండడంతో ఇక మ్యాచ్ జరగడం కష్టమే అనుకున్నారు. కానీ వర్షం ఆగిపోయి గ్రౌండ్ ను సిద్ధం చేశారు సిబ్బంది. దీనితో మ్యాచ్ కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. నిన్న వర్షం కారణంగా ఇండియా 24 .1 ఓవర్ లలో 147 పరుగుల వద్ద ఉండగా మ్యాచ్ ను నిలిపి వేశారు. ఇప్పుడు అక్కడి నుండి మ్యాచ్ స్టార్ట్ అయింది, ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం ఫుల్ ఓవర్ ల పాటు మ్యాచ్ కొనసాగుతుందని అంపైరులు తెలియచేశారు. ఇది నిజంగా మ్యాచ్ ను ఎంజాయి చేయాలి అనుకునే వారికి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక నిన్న బౌలింగ్ చేస్తూ కొంచెం గాయపడిన హరీష్ రాఫ్ ఫీల్డింగ్ కు రాలేదు.

ఇది పాకిస్తాన్ కు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.. ప్రస్తుతం కోహ్లీ మరియు రాహుల్ లు క్రీజులో ఉండగా .. ఎంత టార్గెట్ ను పాకిస్తాన్ ముందు ఉంచుతారు అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news