ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మరింత సమీపిస్తున్న వేల రాజకీయ పార్టీలలో అలజడి రేగుతూఘోది. ముఖ్యంగా అధికార వైసీపీ మరియు ప్రతిపక్ష టీడీపీలు తర్జనభర్జన పడుతున్నాయి. ఇప్పటికే రెండు పార్టీల అధినేతలు టికెట్ లను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయన మాట్లాడుతూ … చంద్రబాబుకు రాయలసీమ ప్రాంతాలపై ఏ విధమైన మమకారం లేదా ప్రేమ కూడా లేవన్నారు. గతంలో వైస్సార్ ఉన్నప్పుడు సీమకు జరిగిన అభివృద్ధి మరియు చంద్రబాబు టైం లో చేసిన అభివృద్ధి పైన చర్చకు రావాలని సవాలు విసిరారు పెద్దిరెడ్డి. ఇంకా ప్రజలకోసం ప్రభుత్వం నిర్మించే ఎన్నో ప్రాజెక్టులను ఆపడానికి కోర్టులకు వెళ్లిన ఘనత ఆయనదంటూ పెద్దిరెడ్డి విమర్శించారు. కనీసం ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి మంచి నీళ్లు గురించి కూడా పట్టించుకోలేదని పెద్దిరెడ్డి మండిపడ్డారు.
ఈయన కూడా రాష్ట్రము అభివృద్ధి గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని చంద్రబాబు పై విమర్శలకు దిగారు.