బాబుకు పెద్దిరెడ్డి అదిరే కౌంటర్..సీమకు చేసిందేమి లేదు.!

-

జగన్ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేశారని, ఏ ఒక్క ప్రాజెక్టుని పూర్తి చేయలేదని, అదే తమ హయాంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులకు నిధులు ఖర్చు చేశామని వేగంగా నిర్మాణాలు చేశామని ఇటీవల టి‌డి‌పి అధినేత చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి మరీ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో బాబు..ఇప్పుడు ప్రాజెక్టుల బాటపట్టారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఉన్న ప్రాజెక్టులని సందర్శించి..అక్కడే సభలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరించనున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా బాబు నందికొట్కూరులో భారీ సభలో పాల్గొన్నారు. అలాగే అక్కడ ముచ్చుమర్రి ప్రాజెక్టుని సందరించనున్నారు. ఆ తర్వాత బనకచర్ల ప్రాజెక్టు పరిశీలించి..పులివెందుల సభలో పాల్గొంటారు. ఇలా వరుసగా అనంతపురం, చిత్తూరు, నెల్లూరు…ఇలా శ్రీకాకుళం వరకు పర్యటించనున్నారు. అయితే వ్యవసాయాన్ని, సాగునీటి ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేసిన బాబు..ఇప్పుడు ప్రాజెక్టుల చుట్టూ తిరగడం విడ్డూరంగా ఉందని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

ఇదే క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..బాబు టార్గెట్ గా కౌంటర్లు ఇచ్చారు. . రాయలసీమకు వైఎస్సార్, చంద్రబాబు, జగన్‌లు ఏమి చేశారో చర్చకు రావాలని, చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు నికర జలాలు కేటాయించలేదని, సీఎం జగన్ తన జిల్లాలోని గండికోట నుంచి చిత్తూరు జిల్లాకు నీళ్ళు కేటాయించారని తెలిపారు.

ఇక హంద్రీ నీవా పనులు వైఎస్ రాజేఖరరెడ్డి హయాంలో 90 శాతం పనులు పూర్తి అయ్యాయని, చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో హంద్రీ  నీవా నీళ్ళు ఇవ్వలేదన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని మండిపడుతున్నారు. మొత్తానికి బాబు చేసే ప్రాజెక్ట్ యాత్ర సక్సెస్ అయ్యేలా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news