న్యూఢిల్లీ: దేశంలో హ్యాకింగ్ ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీంతో కేంద్రం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మోదీ సర్కార్ దేశ ద్రోహానికి పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పెగాసస్ స్పైవేర్‌తో ప్రముఖుల ఫోన్లపై నిఘా ఉంచినట్లు ఆరోపణలు చేస్తోంది. ఈ పెగాసస్ వ్యహారంపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
బుధవారం అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 22న దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయనున్నారు. అన్ని రాష్ట్రాల్లో రాజ్ భవన్ల వద్ద ప్రదర్శనలు నిర్వహించనున్నారు. పెగాసస్ వ్యవహారంపైనా లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జీరో అవర్ నోటీస్ అందజేశారు. ఇక పెగాసస్ వ్యవహారంపై రాజ్యసభలో ఐటీ మంత్రి అశ్వినీ వైష్టవ్ ప్రకటన చేయనున్నారు.