బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తరం అయ్యే అవకాశముందని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అంటూ అటు అధికారులు గత రెండు రోజుల నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా అనుకున్నట్లుగానే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్తా తీవ్ర తుఫాన్ గా మారిపోయింది ప్రస్తుతం పుదుచ్చేరికి 410 కిలోమీటర్ల చెన్నైకి 550 కిలోమీటర్ల దూరంలో ఈ నివర్ తుఫాన్ కేంద్రీకృతం అయి ఉందని మరో 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇక ఈ తుఫాను కారణంగా నెల్లూరు సహా రాయలసీమలోని పలు చోట్ల భారీగా వర్షాలు కురవడంతో పాటు ఈదురు గాలులు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా తీర ప్రాంతాల ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలి అంటూ అధికారులు సూచించారు కాగా నివర్ తుఫాన్ అంతకంతకు తీవ్రరూపం దాలుస్తోంది.ఈ నేపథ్యంలో.. ఈరోజు రాత్రి 9:00 నుంచి 26వ తేదీ వరకు కూడా 144 సెక్షన్ విధిస్తూ ప్రజలెవరూ బయటకు రాకుండా నిషేధాజ్ఞలు విధించింది పుదుచ్చేరి ప్రభుత్వం.