ఇప్పుడు దేశంలో కరోనా వైరస్ కామెడీ అయిపోయింది. అవును నిజంగానే కరోనా వైరస్ నిజం కామెడీగానే చూస్తున్నారు. మరి దాని తీవ్రత అర్థం అయిందో అర్థం కాలేదో తెలియదు గానీ సోషల్ మీడియాలో కరోనా వైరస్ మీద కామెడీ చేస్తూ జనాల్లోకి దాని సీరియస్ నెస్ వెళ్లకుండా కొందరు వెటకారంగా పోస్ట్ లు పెడుతూ అదేవిధంగా బయట జనాలు కూర్చున్న చోట కూడా వైరస్ గురించి కామెడీగా మాట్లాడుతూ అసలు దాని ప్రభావం ఏమాత్రం అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం లేదు.
ఇతర దేశాల్లో వేలాదిమంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. అదేవిధంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా సరే మన భారతలో మాత్రం కరోనా వైరస్ ని సీరియస్ గా తీసుకునే పరిస్థితి కనబడటం లేదు. సోషల్ మీడియాలో దాని మీద పోస్ట్ లు పెట్టడం అదేవిధంగా చైనా నో, ఇటలీని తిట్టడమే గాని ఎక్కడా కూడా దాన్ని సీరియస్ అనేది జనాల్లో కనబడటం లేదు. దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒకపక్క జనాలు బయటకు వెళ్ళవద్దని ప్రభుత్వాలు అన్ని విధాలుగా చెప్తున్నా బయటకు వెళ్తే ప్రాణాలు పోతాయి అని చెప్తున్నా సరే ఎవరూ కూడా మాట వినే పరిస్థితి కనపడటం లేదు.
ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళ చేస్తున్నారు. వ్యాపారాలు ,ఉద్యోగాలు మానకూడదనే విధంగా వ్యవహరిస్తున్నారు. బయటకు రావద్దు అని చెప్తుంటే కరోనా మనకు ఎందుకు వస్తుంది అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం. దాని మీద సరదా వ్యాఖ్యలు చేయడమే గాని ఎవరు కూడా అప్రమత్తంగా వ్యవహరించడం లేదు. ఎవరిని ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెప్తున్నా పొద్దున్నే వాకింగ్ మానడం లేదు. పిల్లలు ఆడుకోవడానికి మానట్లేదు. అలాగే ఆ పార్టీ ఈ పార్టీ కిట్టి పార్టీ లు అంటూ బయటకు వెళ్లడం. చిన్న చిన్న ఫంక్షన్ లో కూడా. అర్ధం చేసుకునే పరిస్థితిలో ఇప్పుడు జనాలు లేదనే కనిపిస్తోంది.
కరోనా వైరస్ గురించి ఇలాగే ఇటలీ తక్కువ అంచనా వేసి ఇప్పుడు నానా సంక నాకుతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒకపక్కన ఇటలీలో వేలాదిమంది చచ్చిపోతున్నా ఇక్కడ మాత్రం ఇతరులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించటం నిజంగా బాధాకరం. ఇలాంటి వాటిని కూడా వెటకారంగా చూడటం అనేది నిజంగా దేశంలో దౌర్భాగ్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరిగా మనలోక౦ చెప్పేది ఒకటే ఎవరి కర్మకు వారే బాధ్యులు.