ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని స్థానిక సంస్థల ఎన్నికల్లో దూకుడు నిండా ముంచిందా…? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జగన్ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఆదేశాలు కాస్త వివాదాస్పదంగా మారాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా ఏకగ్రీవాలు అవ్వాలి అంటూ జగన్ ఇచ్చిన ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు ,ఇతర స్థానిక నాయకులు రెచ్చిపోయారు. ఇప్పుడు అదే పార్టీని ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుంది అంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తాము ఎన్నికలను నిర్వహించాలని ఆదేశించేది లేదని స్పష్టం చేసింది. ఇప్పుడు అది పక్కనపెడితే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమేష్ కుమార్ ఆ రాసిన ఒక లేక ఇప్పుడు వివాదాస్పదంగా మారింది .రాష్ట్రంలో తాను ఎన్నికలను నిర్వహించాలి అంటే కేంద్ర బలగాలు కావాలని అదేవిధంగా అన్ని చోట్లా ఏకగ్రీవం అయ్యాయి. అని అంతేకాకుండా తనకు ప్రాణహాని ఉంది కాబట్టి ప్రభుత్వం భద్రత కల్పించాలని తనకు హైదరాబాదులో ఉండే విధంగా అనుమతి ఇవ్వాలని ఆయన ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.
దీనితో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు పిన్నమనేని ఉదయ్ భాస్కర్ అనే ఒక ఐఏఎస్ అధికారి కూడా గవర్నర్ కి లేఖ రాశారు. తన మీద ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారని తన పనులు తాను చేసుకోనివ్వడం లేదని ఆయన ఆ లేఖలో ఆరోపణలు చేశారు. మరి కొందరు అధికారులు ఇదేవిధంగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనితో జగన్ సర్కార్ ని అధికారుల కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.