బొత్స ఏం చెబుతాడో ప్రజలకు అర్థం కాదు :వర్ల రామయ్య

-

పోలింగ్‌ సరళి చూశాక ఓడిపోతున్నట్లు వైసీపీ నేతలకు అర్థమైపోయిందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. అందుకే వెబ్‌కాస్టింగ్‌ బటన్‌ చంద్రబాబు చేతిలో ఉందని సాక్షిలో తప్పుడు ప్రచారం మొదలుపెట్టారని మండిపడ్డారు.

ఇప్పటికే వైసీపీ నేతలు చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లారని ఆరోపించారు. పోలింగ్‌ బూత్‌లో పిన్నెల్లి చేసిన విధ్వంసం గురించి ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీకు మెజారిటీ వస్తోందని గ్రహించే ఏజెంట్లపై దాడి చేశారని అన్నారు. ఆ సమయంలో పట్టుకోవాల్సిన పోలీసులు.. దగ్గరుండి ఎమ్మెల్యేను కారెక్కించి పంపించారని అన్నారు.

సజ్జలకు ఈ విషయంపై మాట్లాడే ధైర్యం లేకపోయినా.. ఇంకా 144 స్థానాల్లో గెలుస్తామని ఎలా అంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఏ పోలీసులైతే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సలాం కొట్టారో ఆ పోలీసులే పిన్నెల్లిని బాదటానికి సిద్ధంగా ఉన్నారు. అన్నదమ్ములిద్దరూ పరార్‌ కాగానే మాచర్ల ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. బొత్స ఏం చెబుతాడో ప్రజలకు అర్థం కాదు.. ఓడి పోతామన్న వాస్తవం ఆయన గ్రహించడం లేదు” అని వర్ల రామయ్య అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news