ఎన్నికల్లో పోటి చేసే క్యాండియేట్‌ను పల్లి, బఠాని అనడం ఏంటీ?: మల్లు రవి

-

ఎమ్మెల్యే కేటీఆర్ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు .నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కించపరిచేలా మాట్లాడారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ఎన్నికల్లో పోటి చేసే క్యాండియేట్‌ను పల్లి, బఠాని అనడం ఏందని? ఆయన ప్రశ్నించారు. ఇది రూల్స్‌ను అతిక్రమించినట్లేనని మల్లు రవి విమర్శించారు.

ఈ మేరకు కేటీఆర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఈఓ వికాస్ రాజ్‌కు మల్లు రవి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థి బిట్స్ పిలాని అయితే ఆ కాలేజీల్లో మాత్రమే ఓట్లు అడగాలని అన్నారు.పట్టభద్రులపై బీఆర్ఎస్ వైఖరి ఏంటో స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. ఇక జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా సోనియాగాంధీ వస్తున్నారని, ఘనంగా సన్మానిస్తామన్నారు మల్లు రవి.

Read more RELATED
Recommended to you

Latest news