అసలు చంద్రబాబు నాయుడేంటి.. సీఎం కాకపోవడం ఏంటి.. ప్రజలు చాలా పెద్ద తప్పు చేశారు.. నిజంగా బాబును సీఎంగా ఎన్నుకోకపోవడం ప్రజలదే తప్పు.. అంటూ టీడీపీ నేతలు ఏకంగా ప్రజలనే తప్పు పడుతుండడం అది వారి దిగజారుడుతనానికి నిదర్శనంగా అనిపిస్తోంది.
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుది పాపం వింత పరిస్థితి.. ఇన్నాళ్లూ అధికారంలో ఉండి.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండాలంటే ఆయన మనసొప్పడం లేదు కాబోలు.. ఏమిటేమిటో మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓటమి పాలైనా.. తమ పార్టీకి 23 సీట్లే రావడానికి గల కారణాలు తెలిసినా.. ఇంకా తాము ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదని.. పదే పదే.. అవే మాటలను జపిస్తున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారో.. తెలియకుండానే.. జనాలకు అర్థం కాని రీతిలో మాటలను చెబుతూ.. అసలు తామే అధికారంలో ఉండాలి గానీ ఏదో ఇలా జరిగిపోయింది.. అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు.
తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తాను పాలిచ్చే ఆవునని వైసీపీ దున్నపోతని, దాన్ని గెలిపించి దున్నపోతును ఇంటికి తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. ఇక కొందరు నేతలైతే చంద్రబాబు సమక్షంలో ప్రజలదే తప్పు, ఒక మంచి నేతను సీఎంగా ఎన్నుకోవడంలో ప్రజలు విఫలమయ్యారని బాహాటంగానే చెప్పారు. నిజంగా ఇలా మాట్లాడే నేతలను ఏమనాలో అర్థం కావడం లేదు. ఓ వైపు ప్రజలు టీడీపీ అక్కర్లేదని చెప్పి తీర్పునిచ్చినా.. ఇంకా టీడీపీ నేతలు తాము ఓడిపోయామనే నిజాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలు తాము ఎందుకు ఓడిపోయామోనంటూ.. పదే పదే మీడియా ఎదుట మాట్లాడుతుండడం వారి నైరాశ్యాన్ని, బాధను చెప్పకనే చెబుతోంది.
అసలు చంద్రబాబు నాయుడేంటి.. సీఎం కాకపోవడం ఏంటి.. ప్రజలు చాలా పెద్ద తప్పు చేశారు.. నిజంగా బాబును సీఎంగా ఎన్నుకోకపోవడం ప్రజలదే తప్పు.. అంటూ టీడీపీ నేతలు ఏకంగా ప్రజలనే తప్పు పడుతుండడం అది వారి దిగజారుడుతనానికి నిదర్శనంగా అనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ తీర్పు. ప్రజలు తమకు నాయకుడిగా ఎవరు ఉండాలని తీర్పు ఇస్తే వారే నాయకులు అవుతారు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే శిరోధార్యం. అలాంటిది ప్రజలే తప్పు చేశారని తెలుగు తమ్ముళ్లు అంటుండడం.. దాన్ని చంద్రబాబు సమర్థిస్తుండడం.. నిజంగా వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని మనకు తెలుస్తుంది. మరి టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు తెలుగు తమ్ముళ్లకు కూడా ఇక తాము ఓడిపోయామనే సత్యం ఎన్నటికి బోధపడుతుందో.. అందుకు కాలమే సమాధానం చెప్పాలి..!