భారతదేశంలోనే అత్యధికంగా ధాన్యం పండించిన రాష్ట్రం తెలంగాణ అని.. అందుకే తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ శ్రీశైలం పైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం ఏర్పడుతుందన్నారు ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నది నీటి ప్రాజెక్ట్ ల కోసమేనని.. దురదృష్టం పదేళ్ల పాటు కృష్ణా, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టులు కట్టలేదన్నారు.
గోదావరి నుంచి పూర్తిగా దిగువకు నీళ్లు వదులుతారని.. కృష్ణా మీద పైన ఆంధ్రావాళ్లు నీళ్లు తీసుకుంటున్నారన్నారు భట్టి విక్రమార్క. కృష్ణా మీద కట్టిన ప్రాజెక్ట్ లు అన్ని కాంగ్రెస్ చేసిన నిర్మాణాలే అన్నారు. కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాజెక్ట్ కొన్ని పూర్తి చేయలేదని.. రోజుకు 13 TMC ల నీరు శ్రీశైలం పైన తీసుకునేవిధంగా ప్లాన్ చేశారని.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపలేకపోయిందన్నారు. దీనిని ముందే హెచ్చరించే పవర్ ప్రజెంటేషన్ ఇచ్చానన్నారు.