పుష్కరాలకి వెళ్తున్నారా.. ఇది గుర్తుంచుకోండి..!

-

సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలు వచ్చాయి అంటే లక్షల సంఖ్యలో జనాలు తరలి వెళ్లి పుష్కర స్నానం చేస్తూ పుణ్యఫలం రావాలని కోరుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పుష్కరాలు వచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ ఎక్కువ జనాభా కనిపించడం లేదు. మరికొంతమంది మాత్రం ఎప్పటికీ పుష్కరాలలో స్నానం నదుల వద్దకు వెళితే ఉన్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అటు ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. కాగా తుంగభద్ర పుష్కరాలు భాగంగా ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది ఇటీవల కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో ఎస్సై సహా పుష్కర విధులు నిర్వహిస్తున్న నలుగురు పోలీస్ అధికారులకు కరోనా పాజిటివ్ రావడం సంచలనం గా మారిపోయింది.

ఈ క్రమంలోనే పోలీస్ అధికారులతో కలిసి ఇప్పటివరకు విధులు నిర్వహించిన వారిలో టెన్షన్ మొదలైంది. అటు ఎంతో మంది ప్రజలు కూడా పోలీసు అధికారుల పర్యవేక్షణలో పుష్కర స్నానం చేశారు. ఈ క్రమంలోనే పుష్కర స్నానాలకు వెళ్లే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని.. నదిలో స్నానాలు చేయకూడదని అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news