గతంలో పొత్తు పెట్టుకుని ఏం సాధించారో ప్రజలకు తెలియజేయాలి : వైఎస్ షర్మిల

-

మరికొన్ని రోజులలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ టూర్ లో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది అని చంద్ర బాబు నాయుడు వెల్లడించారు.

చంద్రబాబు, పవన్ పై ఢిల్లీ టూర్ పై స్పందించిన వైయస్ షర్మిల… బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారో ప్రజలకు చెప్పాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీసీసీ చీఫ్ నిలదీశారు. ‘గతంలో చంద్రబాబు పాలన చూశాం. బీజేపీ కూడా రాష్ట్రానికి చేసిందేమీ లేదు.. అందరూ దొంగలే. వారు ఎందుకు కలుస్తున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. గతంలో పొత్తు పెట్టుకుని ఏం సాధించారో ప్రజలకు తెలియజేయాలి’ అని ఆమె అన్నారు.కాగా,పొత్తులో భాగంగా జనసేన-బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ స్థానాలు, 8 లోక్ సభ స్థానాలు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక టీడీపి 145 MLA స్థానాలు , 17 MP స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు టాక్.

Read more RELATED
Recommended to you

Latest news