గూడ్ న్యూస్ : నేటి నుంచి ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి అనుమతి

-

హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేష్ భక్తులకు శుభవార్త చెప్పింది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ. నేటి నుంచి ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి అనుమతి ఇచ్చింది ఉత్సవ్ కమిటీ. కరోనా మహమ్మారి నేపథ్యం లో 40 అడుగుల ఎత్తన విగ్రహం తో, పంచముఖ గణపతి గా దర్శనం ఇవ్వనున్నారు ఖైరతాబాద్ గణేష్.

కరోనా మహమ్మారి త్వరగా భూమి పై నుంచి వెళ్లాలని కాల నాగేశ్వరి, కృష్ణ కాళికా దేవతల విగ్రహాలను ప్రతిష్ట చేసింది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ. ఈ నెల 10 వ తారీకు నుంచి 19 వ తారీకు వరకు గణపతి దర్శనం ఉండనుంది. అలాగే ఖైరతాబాద్ గణేష్ 19 న తేదీన నిమర్జనం కానునుంది. ఈ ఏడాది 900 కేజీల భారీ లడ్డు ప్రసాదం అందజేయనున్నాడు ఓ భక్తుడు. మరో వారం లో గణేష్ చతుర్థి ఉన్న నేపథ్యం లో అన్నీ ఏర్పాట్లు చేసింది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ. ఈ నేపథ్యం లోనే ఇవాల్టి నుంచే ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి అనుమతి ఇచ్చింది ఉత్సవ్ కమిటీ.

Read more RELATED
Recommended to you

Latest news