ప్రైవేట్ ఉపాధ్యాయులకు డబుల్ బెడ్రూం ఇండ్లు : హరీష్ రావు

ఉపాధ్యాయ దినోత్సవ నేపథ్యంలో టీచర్లకు మంత్రి హరీష్ రావు తీపికబురు చెప్పారు. రాష్ట్రంలోని ప్రయివేట్ ఉపాధ్యాయులకు డబుల్ బెడ్రూం లు కల్పిస్తామని హామీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి గురు పూజోత్సవం కార్యక్రమం లో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు అన్న, ఎంతటి స్థాయి కి ఎదిగిన గురువు గుర్తుకు వస్తారన్నారు.

harish rao | హరీష్ రావు
harish rao | హరీష్ రావు

ఉపాధ్యాయ ఎం ఎల్ సి అని గురువులు చట్టసభల్లో ఉండాలని పెట్టుకున్నామని.. విద్య ఉద్యోగం కోసం కాదు,ఉన్నతమైన గౌరవం కోసమనీ పేర్కొన్నారు.కంటికి కనబడని సూక్ష్మ జీవి ప్రపంచాన్ని గడగడలాడించిందని.. కరోనా వ్యాధి అన్ని రంగాలను దెబ్బ తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే డొక్కాడని వారు ప్రయివేట్ ఉపాధ్యాయులు అని.. పోయిన నెల ఆగిన కరోనా జీతభత్యం రిలీజ్ చేస్తామన్నారు. జిల్లాల వారిగా ఎన్ని ఖాళీలను ఆ జిల్లాల వారికే ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం చేపడుతోందన్నారు. జోనల్ విధానంలో మార్పులు చేర్పులు జరుగుతున్నవి, అందుకే ఉద్యోగాల భర్తీలో ఆలస్యం అవుతుందన్నారు.