బాత్ రూమ్ లో భారీగా బంగారం : శంషాబాద్ లో విమానం అత్యవసర ల్యాండింగ్

-

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఓ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. దుబాయ్ నుండి హైదరాబాద్ వస్తున్న VTIXK ఇండిగో విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ అయింది. ఆ విమానం లోని బాత్ రూమ్ లాక్ చేసి ఉండడం తో అనుమానం వచ్చిన ఆధికారులు.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

ఈ నేపథ్యం లోనే హూటా హూటీన సిఐఎస్ఎఫ్ ఆధికారులను రప్పించారు విమాన సిబ్బంది. సిఐఎస్ఎఫ్ ఆధికారులు తనిఖీ చేయడం తో విమానంలోని బాత్ రూమ్ లో అక్రమ బంగారం లభ్యం అయింది. దీంతో ఆఅ బంగారం స్వాధీనం చేసుకున్న సెక్యూరిటి ఆధికారులు కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. దుబాయ్ నుండి బంగారం తరలించిన ఇద్దరు మహిళల ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.. విచారణ చేపడుతున్నారు. అసలు బంగారం ఎలా తీసుకు వచ్చారనే దానిపై విచారణ చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news