దయచేసి రైతులు ఆయన మాయలో పడొద్దు..!

మొదటి నుంచి ఏపీలో వ్యవసాయ అభివృద్ధికి రైతులకు మేలు జరిగే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంది జగన్మోహన్రెడ్డి సర్కార్. ఈ క్రమంలోనే ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుకు మద్దతు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరి బోరు మోటార్ల కు మీటర్లు బిగించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించడం ద్వారా ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు అంటూ ఏపీ ప్రభుత్వం చెబుతోంది. రైతులందరికీ నాణ్యమైన విద్యుత్తు అందించడంతో పాటు విద్యుత్ బిల్లులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెబుతోంది జగన్మోహన్రెడ్డి సర్కార్.

కానీ అటు ప్రతిపక్ష పార్టీలు మాత్రం వ్యవసాయ బోర్లకు బిగించే మీటర్ల కనెక్షన్లు రైతులందరికీ ఉరితాళ్ల లాంటివి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతిపక్షాల విమర్శలు పై స్పందించిన పేర్ని నాని ప్రతిపక్షాల పై విమర్శలు గుప్పించారు. వ్యవసాయ బోర్లకు బిగించే మీటర్ కలెక్షన్ల పై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం చేస్తున్నారని రైతులు వాటిని నమ్మవద్దు అంటూ సూచించారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మి రైతులు చంద్రబాబు మాయలో పడవద్దని సూచించారు మంత్రి పేర్ని నాని. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తుంది అంటూ స్పష్టం చేశారు,