గర్భిణీ ఆత్మహత్య.. భర్త చేసిన పనికి తట్టుకోలేక..?

ఇటీవలే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తనతో పాటు తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణం కూడా తీసింది సదరు వివాహిత. దీనికంతటికీ కారణం భర్త అన్నది తెలుస్తుంది. కోటి ఆశలతో పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టిన వివాహితకు… ఏ కష్టం లేకుండా చూసుకుంటాడు అనుకున్న భర్త కష్టం గా మారిపోయాడు. అదనపు కట్నం కోసం భార్యను వేధించడం మొదలు పెట్టాడు భర్త. అప్పటికే ఎంతో కష్టపడి పెళ్లి చేసి పెళ్లి సమయంలో కట్నం కూడా ముట్ట చెప్పిన తల్లిదండ్రులను మళ్లీ అదనపు కట్నం కోసం అడగడం ఇష్టం లేక చివరికి కఠిన నిర్ణయం తీసుకుని ఐదు నెలల గర్భిణీ ఆత్మహత్య చేసుకుంది.

dead body

ఈ విషాదకర ఘటన హైదరాబాదులోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కృష్ణప్రియ అనే వివాహిత ఆత్మహత్య చేసుకోవడం ఆత్మహత్య చేసుకున్న సమయంలో కృష్ణప్రియ ఐదు నెలల గర్భవతి కావడంతో ఈ ఘటన స్థానికులను కలచివేసింది. అయితే అత్తమామలు భర్త అదనపు కట్నం కోసం తమ కూతురుని వేదించడం కారణంగానే మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుందని కృష్ణప్రియ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.