ఏపీలో స్థానిక ఎన్నికల గురించి మళ్ళీ చర్చ మొదలుయింది. ఒకప్పుడు ఎన్నికలకి వెళ్దామని తీవ్రంగా ప్రయత్నించిన ఏపీ సర్కార్ అప్పుడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మీద ఫైర్ అయింది. అది ఎంత పెద్ద రచ్చ అయిందో మనందరికీ తెలుసు. ఆ తరువాత ఆయన పదవిని తప్పించడం. ఆయన మళ్ళీ దాని కోసం కోర్టులో పోరాడి మరీ పదవి సాధించుకున్నారు. ఇప్పుడు ఆయన ఎన్నికలు పెడదామని సిద్దం అవుతోంటే ప్రభుత్వం మాత్రం ఇప్పుడు వద్దని అంటోంది. ఈ మేరకు నిన్ననే ఏపీ మంత్రో గౌతమ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ రోజు కూడా ఆయన కామెంట్స్ ని బలపరుస్తూ మంత్రి పేర్ని నాని కూడా అలానే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే జగన్ సర్కార్ కు ముఖ్యమని అన్నారు. కోవిడ్ కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపిందని ఆయన అన్నారు. చంద్రబాబు, అచ్ఛెన్నాయుడుకి భయపడి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం లేదనుకోవద్దని ఆయన అన్నారు. వైద్యశాఖ అధికారులతో మాట్లాడి స్థానిక ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్ని పేర్కొనారు. కోవిడ్ కు భయపడి కోర్టు వాదనలు సైతం ఆన్ లైన్ లో వింటున్నారని అలాంటిది ఎన్నికలు పెట్టడం సరికాదని ఆయన అన్నారు.