చంద్రబాబుకు సరిపోయే పేరు నారా గజిని – పేర్ని నాని

-

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్‌లు వేశారు. నారా చంద్రబాబుకు సరిపోయే పేరు నారా గజిని అంటూ చురకలు అంటించారు. 1996 లోనూ ఇదే రకంగా వరద వచ్చి ఊర్లు మునిగిపోయాయని వెల్లడించారు. అప్పుడు పోలవరం లేదుగా… మరి చంద్రబాబు బకెట్, చీపిరి, చాట పట్టుకుని ఇల్లిల్లూ కడిగాడా?? అని మండిపడ్డారు.

చంద్రబాబు తన జీవిత కాలంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చాడా?? అని ప్రశ్నించారు. హుద్ హుద్, తిత్లీ తుఫాన్లలో జీవోలు తప్పా… బాధితులకు చంద్రబాబు డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిత్లీ తుఫానులో చంద్రబాబు హెలికాప్టర్, ఏసీ బస్సు మినహా ట్రాక్టర్ ఎందుకు ఎక్కలేదు?? అని ఓ రేంజ్‌ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. హుద్ హుద్, తిత్లీ తుఫాన్లలో జారీ చేసిన జీవోలకు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బాధితులకు డబ్బులు చెల్లించారని మాజీ మంత్రి పేర్ని నారి ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news