ఈ రోజుల్లో ప్రజల అవసరాల గురించి ప్రత్యేకంగా చెప్పకపోయినా… ఏ అవసరానికి అయినా సరే డబ్బు అనేది ప్రధానం. డబ్బు ఉన్న వాళ్ళ గురించి ఏమో గాని డబ్బు లేని వాళ్ళు మాత్రం ఎక్కువగా అప్పుల మీద ఆధారపడుతున్నారు. అప్పులు తీసుకోవడానికి బ్యాంకు ల చుట్టూ తిరుగుతున్నారు. ముందు వ్యక్తిగత అవసరాల కోసం క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు అంటూ బ్యాంకు ల వద్దకు వెళ్తున్నారు. ఇక మీరు తీసుకునే రుణాల ఆధారంగా వడ్డీల చెల్లింపులు ఉంటాయి. ఇంతకి క్రెడిట్ కార్డు నయమా…? లేక పర్సనల్ లోనేనా…? ఒకసారి చూద్దాం…
నిపుణులు చెప్పే దాని ప్రకారం చూస్తే పర్సనల్ లోన్ బెస్ట్ అని అంటున్నారు. అది ఎందుకు అంటే… క్రెడిట్ కార్డ్ పై వడ్డీ 25 శాతం వరకు వేస్తే వ్యక్తిగత ఋణం పై అది కేవలం 10 నుంచి 12 శాతం మాత్రమే ఉంటుందట. వ్యక్తిగత రుణం అనేది ముందుగా చెల్లించడానికి ఏ ఇబ్బంది ఉండదు… కాని క్రెడిట్ కార్డు రుణాన్ని ముందుగా చెల్లించాలి అంటే కచ్చితంగా 3 శాతం నుంచి 5 శాతం వరకు ప్రీపేమెంట్ పెనాలిటి అనేది ఉంటుంది. క్రెడిట్ కార్డు తీసుకోవాలి అంటే మీరు గతంలో క్రెడిట్ వాడిన వారై ఉంటేనే వీలు అవుతుందట.
అదే వ్యక్తిగత ఋణం అయితే మీకు బ్యాంకు లో ఖాతాతో పని లేదు. ఇక ఎక్కువ మొత్తంలో మీరు ఋణం తీసుకుంటే వ్యక్తిగత రుణమే మంచిది… తక్కువ మొత్తంలో అయితే క్రెడిట్ కార్డు ఋణం తీసుకోవడం ఉత్తమం. ఈ రెండింటికి వాయిదాల చెల్లింపులు ఉన్నాయి కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు… వ్యక్తిగత ఋణం అనేది ఆదాయం ఆధారంగా మంజూరు చేస్తూ ఉంటారు. ఏ ఋణం తీసుకున్నా సరే చెల్లింపులు సరిగా ఉంటె బ్యాంకింగ్ వ్యవస్థలో ఏ ఇబ్బందులు ఉండవు అనేది నిపుణుల మాట. కాబట్టి ఋణం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచిస్తే మంచిది.