ఇకపై ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపిస్తే జైలుకే..!

-

సమాజంలో ఎక్కడికి వెళ్లినా ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు వివక్షను ఎదుర్కొంటుంటారు. ఫలానా వ్యక్తికి ఎయిడ్స్ ఉందని తెలిస్తే ఆ వ్యక్తి నుంచి అందరూ దూరంగా ఉంటారు. ఇక కొన్ని సందర్భాల్లోనైతే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు దాడులకు గురవుతుంటారు కూడా. అయితే ఇకపై వారు ఇలాంటి ఇబ్బందులను పడాల్సిన పనిలేదు. ఎందుకంటే.. ఇకపై ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల పట్ల వివక్ష చూపించినా, వారిపై దాడి చేసినా జైలు శిక్ష పడుతుంది. దీంతోపాటు జరిమానా కూడా వేస్తారు. ఈ మేరకు కేంద్రం ఓ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల పట్ల వివక్ష చూపిన వారికి, వారిపై దాడి చేసిన వారికి ఇకపై రెండేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. దీంతోపాటు రూ.1 లక్ష వరకు జరిమానా ఉంటుంది. దేశంలోనే తొలిసారిగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల రక్షణ కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకోగా, దీనికి గాను కేంద్రం తాజాగా నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది. మన దేశంలో చాలా చోట్ల నిత్యం ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వివక్షకు గురవుతున్నారని, వారిపై దాడులు కూడా పెరుగుతున్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం తెలిపింది.

మన దేశంలో 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్సు వారిలో సుమారుగా 2.1 మిలియన్ల మంది ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు ఉన్నారు. ఈ క్రమంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వారికి రక్షణ కల్పించనుంది. పనిచేసే ప్రదేశాలు, హాస్పిటల్స్, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు తదితర అనేక ప్రదేశాల్లో ఎయిడ్స్ రోగులు నిత్యం వివక్షకు లోనవుతుండగా వారందరికీ కేంద్రం నిర్ణయంతో ఊరట లభించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news