పెగాసస్ పై సుప్రీంకోర్టులో పిటిషన్..

-

గత కొన్ని రోజులుగా భారతదేశ వ్యాప్తంగా పెగాసస్ పై వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఫోన్ హ్యాకింగ్ సాఫ్ట్ వేర్ అయిన పెగాసస్ ని భారత ప్రభుత్వం ఉపయోగించిందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ కి చెందిన సంస్థ రూపొందించిన ఈ సాఫ్ట్ వేర్ ని కేవలం ప్రభుత్వాలకి మాత్రమే అమ్ముతామని ప్రకటించింది. దాంతో భారత ప్రభుత్వం కూడా పెగాసస్ సాఫ్ట్ వేర్ ని తీసుకుందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీని సాయంతో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, న్యాయవాదుల ఫోన్లని హ్యాక్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పెగాసస్ సాఫ్ట్ వేర్ పై దర్యాప్తు నిర్వహించాలని సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలైంది. భారత ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్ వేర్ ని ఉపయోగించిందా లేదా అనే విషయంలో దర్యాప్తు జరపాలని పిటీషన్ డిమాండ్ చేసారు. పెగాసస్ కుంభకోణం చాలా తీవ్రమైనదని, ఇది భారతదేశ భద్రత, న్యాయవ్యవస్థలకు విఘాతం కలిగిస్తుందని, అదీగాక ఎలాంటి అనుమతులు లేకుండా యధేఛ్ఛగా ఇష్టానుసారంగా వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం చట్ట విరుద్ధమని కాదని పిటీషనర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news