“టీటీడీ బోర్డు లో ఆ ముగ్గురిని సస్పెండ్ చేయాలి”

-

ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ బోర్డు మెంబర్స్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సభ్యుల నియామకం పైన హై కోర్ట్ లో పిటిషన్ నమోదు అయింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం చింతా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు.. ఈయన పిటిషన్ లో పేర్కొన్న ప్రకారం ఈ టీం లో ముగ్గురు సభ్యులు ఈ పదవికి అర్హులు కాదని వివరించారు. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కేతన్ దేశాయ్ మరియు శరత్ చంద్రారెడ్డి ల నియామకానికి వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. వీరి ముగ్గురికి నేర చరిత్ర, మద్యం వ్యాపారాలు ఉన్నాయని.. అందుకే వీరు స్వామి వారి సేవకు అర్హులు కాదని పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అందుకే వీరిని ఆ పదవుల నుండి తొలగించాలని కోరారు. కాగా హై కోర్ట్ ఈ పిటిషన్ పై ఎప్పుడు విచారణ చేస్తుంది అన్నది తెలియాల్సి ఉంది. కానీ వీలైనంత త్వరగా ఈ విషయంపై కోర్ట్ నిర్ణయం తీసుకుంటుందా అంటే అనుమానమే అని చెప్పాలి.

ఈ పిటిషన్ కు సరైన సాక్ష్యాధారాలు మరియు ఇరువర్గాల వాదనలు విన్న తర్వాతనే తుది తీర్పు వెలువడే అవకాశం ఉంటుంది. మరి ఈ విషయంలో ముందు ముందు ఏమి జరగనుంది అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news