లూడోగేమ్(Ludo) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న వారి దగ్గరి నుంచి పెద్దవాళ్ల దాకా చాలామంది దీన్ని ఆడుతుంటారు. ఇండియాలో చాలామంది ఈ యాప్‌కు కస్టమర్లు ఉన్నారు. ఒకరికి మించి రూమ్ క్రియేట్ చేసుకుని ఎక్కువ మంది ఆడొచ్చు. పైగా పక్కపక్కనే ఉండాల్సిన అవసరం కూడా లేదు. దీంతో ఈ గేమ్‌కు చాలామంది అభిమానులు ఉన్నారు.
ఇక ఈ గేమ్ ఆడుతూ చాలామంది తమసమయాన్ని వృథా చేసుకుంటున్నారనే వాదన కూడా ఉంది. అసలు ఇది పుట్టింది మన పల్లెల్లో ఆడేఅష్టచమ్మా లాగే ఉంటుంది. సేమ్ అందులో కూడా ఇలాంటి రూల్స్ ఉంటాయి. కాకపోతే కొన్ని ఎక్స్‌ట్రా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి.
అయితే ఇప్పుడు ఈ గేమ్‌ను నిషేధించాలంటూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన నేత ఒకరు దీన్ని నిషేధించాలనికోరుతూ మొదటగా మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ లూడో గేమ్ మంచినైపుణ్యత కలిగినదంటూ మెజిస్ట్రేట్ కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఆయన బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జూన్ 22లోగా వివరణ ఇవ్వాలంటూ కోర్టు లూడో గేమ్ సంస్థను ఆదేశించింది.