
ప్రజలు కారోనా నుండి తప్పించుకోలేక బాధపడుతుంటే.. మరోపక్క నుండి ప్రభుత్వాలు కూడా ప్రజలనే దెబ్బ కొడుతున్నాయి. డబ్బు లేక సంపాదన లేక జీవనం సాగిస్తుంటే వారికి మరిన్ని చిక్కులు తెచ్చే పనులు చేస్తుంది ప్రభుత్వం. పెట్రోల్ డీజిల్ చమురు ధరలు దంచికొడుతున్నాయి. పెట్రోల్ ధరలు ప్రతి రోజు పెరుతూనే ఉన్నాయి అలా నేటికీ 21 రోజు. 21 రోజు కూడా పెట్రోల్ ధర పెరిగింది. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 21 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.38, లీటర్ డీజిల్ ధర రూ.80.40కి చేరింది. లాక్ డౌన్ కు ముందు పెట్రోల్ ధర 71.26 ఉండగా అది కాస్తా ఇప్పుడు 80.33 రూపాయలు చేరింది. దీంతో వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనబడుతున్నాయి. ప్రత్యేఖ ప్యాకేజ్ లో ఇచ్చిన డబ్బును కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇలా తిరిగి తీసుకుంటున్నాయని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.