గత రెండు రోజులుగా ఈఎస్ఐ అవినీతికేసులో మాజీమంత్రి, టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు ఆసుపత్రిలోనే విచారిస్తున్నారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడుని అధికారులు అడుగుతున్న ప్రశ్నలన్నింటినీ… రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి తీసుకొచ్చి ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తున్న.. ఈఎస్ఐ అధికారులు చెప్పే వివరాలనుబట్టే ఉంటున్నాయని అంటున్నారు! ఈ సమయంలో అచ్చెన్నా చెప్పే ప్రతీ సమాధానం… తనను తాను కాపాడుకోవడంతోపాటు, నేరం మొత్తం అధికారులపై నెట్టేసే విధంగా ఉందని తెలుస్తొంది. ఈ క్రమంలో మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తుంది.
ఆంధ్ర సచివాలయం హైదరాబాద్ లో ఉన్న సమయంలో మూడు సిఫారసు లేఖలు, అమరావతికి వచ్చిన తర్వాత మరో రెండు సిఫారసు లేఖలు అచ్చెన్న ఇచ్చారని ఈఎస్ ఐ అధికారులు వెల్లడించారంట. ఈ క్రమంలో ఈ ప్రశ్నకు అచ్చెన్న సమాధానం…” అన్ని ప్రభుత్వ విభాగాల్లో లేఖలనేవి సర్వసాధారణ విషయం”. అని అనంతరం స్పందించిన అచ్చెన్న..”టెలీహెల్త్‌కు సంబంధించి కొనుగోళ్లు జరిగిన సమయంలో నేను కార్మిక శాఖ మంత్రిగా లేను” అని అంట!
అంటే… ఆ సమయంలో కార్మిక శాఖా మంత్రిగా పనిచేసింది పితాని సత్యనారాయణ! దీంతో ఆయనపై నెక్స్ట్ విచారణ ఉండొచ్చని అంటున్నారు. ఏపీ రాష్ట్రంలో కార్మిక శాఖలో బడ్జెట్ కు మించి ఖర్చులు పెట్టారని కార్మికశాఖ ఉన్నతాధికారులు మెమోను జారీ చేశారని.. రెండో క్వార్టర్ లో కేటాయించిన దాని కంటే అదనంగా రూ. 34.05 కోట్లను ఖర్చు చేసినట్టు అధికారులు గుర్తించారు! అయితే ఈ మోమోను అభయన్స్‌లో పెట్టాలని 2018 ఫిబ్రవరి మాసంలో అప్పటి మంత్రి పితాని సత్యానారాయణ ఆదేశాలు జారీచేశారంట. దీంతో ఈ విషయంపై ఇప్పటికే విజిలెన్స్ అధికారులు ఆరాతీశారని.. అచ్చెన్న చెబుతున్న సమాధానాలు, విజిలెన్స్ అధికారులు రాబట్టిన సమాచారాలను బట్టి చూస్తే… నెక్స్ట్ పితానే అనే మాటలు వినిపిస్తున్నాయి!