వాహనదారులకు బిగ్‌ షాక్‌..మరోసారి పెరిగిన పెట్రోల్‌ ధరలు

మన ఇండియాలో పెట్రోల్‌ మరియు డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. పెట్రోల్‌ మరియు డీజిల్‌ ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నాయి. ఇక తాజాగా మరోసారి పెట్రోల్‌ మరియు డీజిల్‌ ధరలు పెరిగిపోయాయి.

Petrol and Diesel
Petrol and Diesel

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ పై 35 పైసల్‌ మరియు లీటర్‌ డీజిల్‌ పై 35 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.64 కు చేరగా డీజిల్ ధర రూ. 97.37 కు పెరిగింది. ముంబై లో రూ. 114.47 , కు చేరగా డీజిల్ ధర రూ. 105.49 కు పెరిగింది.

కోల్ కతాలో రూ . 109.02 కు చేరగా డీజిల్ ధర రూ. 100.49 కు పెరిగింది. చెన్నైలో రూ . 105.43 కు చేరగా డీజిల్ ధర రూ.101.59 కు పెరిగింది. అలాగే హైదరాబాద్ నగరం లో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.59 కు చేరగా డీజిల్ ధర రూ. 105. 84 కు పెరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 115. 35 కు చేరగా డీజిల్ ధర రూ. 107.87 కు చేరుకుంది.