ఆర్ధిక సంక్షోభం: లీటర్ పెట్రోల్ రూ. 300 కుపైగానే !

-

ఇండియాకు దాయాధి దేశం అయిన పాకిస్తాన్ ఇప్పుడు తీవ్రమైన నష్టాలలో కొనసాగుతోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆర్ధిక సంక్షోభం కారణంగా అన్ని ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లేటెస్ట్ గా పాకిస్తాన్ లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు హద్దులు లేకుండా పెరిగిపోయిన వైనం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నిన్నటి వరకు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు VARUSAGAA రూ. 290 .45 మరియు రూ. 293 .40 గా ఉండగా, ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న అన్వార్ ఉల్ హాక్ ఒక్కసారిగా పెట్రోల్ పై రూ. 14.91 మరియు డీజిల్ పై రూ. 18 .44 పెంచడంతో ఇప్పుడు పెట్రోల్ ధర రూ. 305 .36 మరియు డీజిల్ ధర రూ. 311 .84 గా ఉన్నాయి. ఈ విధంగా పెరిగిన ధరలతో పాకిస్తాన్ చరిత్రలోనే మొదటిసారిగా అత్యధిక స్థాయిని తాకాయి.

కాగా ఇప్పటికే పాకిస్తాన్ లో భారీగా పెరిగిపోయిన విద్యుత్ దరల పై నిరసనలు జరుగుతుండగా, కొత్తగా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరగడంతో పాకిస్తాన్ ప్రజలకు పెనుభారంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news