మీ పీఎఫ్ డబ్బుల్ని విత్ డ్రా చెయ్యాలా..? అయితే ఇలా ఈజీగా ఆన్ లైన్ లోనే..!

-

భవిష్యత్తు లో ఏ ఇబ్బంది ఉండకూడదని చాలా మంది నచ్చిన పథకాల్లో డబ్బులు పెడుతూ వుంటారు. ఇలా చెయ్యడమే మంచి పద్దతి. కేంద్రం ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్‌ పథకం ని లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇది ఉద్యోగుల కోసం కేంద్రం తీసుకొచ్చిన సేవింగ్స్‌ స్కీమ్.

ఈపీఎఫ్‌ రాబడి, విత్‌డ్రా ప్రాసెస్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పదవీ విరమణ తర్వాత ఉద్యోగుల భవిష్యత్తు బాగుండాలనే ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు. దీని వడ్డీ రేటు 8.10 శాతంగా ఉంది. వివాహం, ఉన్నత విద్య, ఇంటి నిర్మాణం మొదలైన వాటికి ఈ నగదును విత్‌డ్రా చెయ్యచ్చు. ఇక ఎలా EPFO విత్‌డ్రాకి ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చెయ్యచ్చనేది చూసేద్దాం.

దీని కోసం మీరు EPFOకి చెందిన e-SEWA పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ లోకి వెళ్ళండి.
ఆ తరవాత యూనివర్సల్ అకౌంట్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చెయ్యండి.
ఇప్పుడు మీరు ‘క్లెయిమ్ (ఫారం-31, 19 & 10సి)’ ఆప్షన్‌ ని ఎంపిక చేసేయండి.
PF అకౌంట్‌ తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్‌ నంబర్‌ ని ఎంటర్‌ చేసి, వెరిఫై బటన్‌పై క్లిక్ చేయాలి.
ప్రొసీడ్‌ ఫర్‌ ఆన్‌లైన్ క్లెయిమ్ ని ఎంచుకోండి.
ఆ తరవాత ఐ వాంట్ టూ అప్లై ఫర్ మీద నొక్కండి.
క్లెయిమ్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.
ఫారం సెలక్ట్‌ చేసుకున్నాక విత్‌డ్రా చేసేందుకు కారణం చెప్పండి.
విత్‌డ్రా చేస్తున్న మొత్తం, అడ్రెస్‌ ని ఎంటర్‌ చేయాలి.
అప్లికేషన్‌ ప్రాసెస్‌ కంటిన్యూ చేసేందుకు ప్రొసీడ్‌పై క్లిక్‌ చేయాలి.
15 నుంచి 20 రోజులలోపు మీ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news