పీఎఫ్‌ యూఏఎన్‌ నంబర్‌ మరచిపోయారా..? అయితే ఇలా చెయ్యండి..!

-

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగులందరికీ 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ని జారీ చేసింది. ఈపీఎఫ్ పోర్టల్‌ లో యూఏఎన్ నెంబర్ ని పొందొచ్చు. అయితే ఉద్యోగులు ఎన్ని ఉద్యోగాలు మారినా సరే అదే నెంబర్ ఉంటుంది.

ఈఫీఎఫ్‌వో కొత్త ధ్రువీకరణ ఐడీని కేటాయిస్తుంది కదా అది ఒరిజినల్ యూఏఎన్‌తో లింక్ అవుతుంది. ఈపీఎఫ్‌వో సేవలను పొందుటకు యూఎన్‌ఏ నెంబర్‌ తో కేవైసీ వివరాలు లింక్‌ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక ఆ నెంబర్ మరచిపోతే ఇబ్బంది పడాలి. ఒకవేళ పిన్ మరచిపోతే దాన్ని ఎలా పొందాలి అనేది ఇప్పుడు చూద్దాం.

మీరు కనుక పిన్ ని మరచిపోతే అధికారిక వెబ్‌ సైట్‌ ఈపీఎఫ్‌ లో పోర్టల్‌లోకి లాగిన్‌ అవ్వాలి.
తరవాత హోమ్‌ పేజీలో ఉన్న నో యు యుఏఎన్‌ మీద నొక్కండి.
మెంబర్ ఐడీ ఐడీ, రాష్ట్రం, రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్, పేరు, పుట్టిన తేదీ వంటి డీటెయిల్స్ ని ఇవ్వాల్సి వుంది.
ఇప్పుడు మీరు గెట్ ఆథరైజేషన్ పిన్‌ పై క్లిక్ చేయాలి.
మీ పీఎఫ్ మెంబర్ ఐడీ తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఒక పిన్ నెంబర్ మెసేజ్ వస్తుంది. దానిని కూడా మీరు ఎంటర్ చేయాలి.
ఇప్పుడు వాలిడేట్ ఓటీపీ అండ్ గెట్ యూఏఎన్‌పై క్లిక్ చేసి… యూనివర్సల్ అకౌంట్ నెంబర్ మీ ఫోన్ లో వచ్చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news