నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన PGIMER…!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (PGIMER) నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని ఇస్తోంది. సీనియర్ రెసిడెంట్స్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పింది. అర్హత, ఆసక్తి వున్నవాళ్లు మార్చి 8న నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే… మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు.

బయోకెమిస్ట్రీ 1 పోస్టు, కమ్యూనిటీ మెడిసిన్ 01 , జనరల్ సర్జరీ 01, హెమటాలజీ 01, హాస్పటల్ అడ్మినిస్ట్రేషన్ 01, ఇంటర్నల్ మెడిసిన్ 01, పెడియాట్రిక్స్ 01, గైనీ 01, అఫ్తాల్మొలజీ 01, ఆర్థోపెడిక్స్ 01 ఉన్నాయి. ఇక అర్హత కోసం చూస్తే…బయోకెమిస్ట్రీ అయితే ఈ విభాగంలో ఉద్యోగాలకు అప్లై చేయాల్సిన వారు MD (Biochemistry) చేసి ఉండాలి. అలానే కమ్యూనిటీ మెడిసిన్ కి అయితే సంబంధిత సబ్జెక్టు లో ఎండీ విద్యార్హత కలిగిన వారు ఈ విభాగం లోని ఉద్యోగాలకు అప్లై చెయ్యొచ్చు. జనరల్ సర్జరీ కి అయితే MS(Surgery) చేసిన వారు ఈ విభాగం లోని పోస్టులకు అప్లై చేయవచ్చు.

హెమటాలజీ అయితే సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ విభాగం లో ఉన్న పోస్టులకి అప్లై చెయ్యొచ్చు. హాస్పటల్ అడ్మినిస్ట్రేషన్ పోస్టులకి అయితే సంబంధిత సబ్జెక్టులలో మాస్టర్ డిగ్రీ ఉండాలి. ఇంటర్నల్ మెడిసిన్ కోసం సంబంధిత సబ్జెక్టులో ఎండీ చేసిన వారు అప్లై చేయడానికి అర్హులు. మిగిలిన వాటికి కూస సబ్జెక్టుల్లో ఎండీ/ఎంఎస్ చేసిన వారు అప్లై చేయవచ్చు. వయస్సు ధ్రువీకరణ, విద్యార్హత, క్వాలిఫికేషన్, అనుభవానికి సంబంధించిన డాక్యుమెంట్లను ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తీసుకు రావాలి. నోటిఫికేషన్ నుండి మిగిలిన వివరాలని తెలుసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news