ఫోన్ ట్యాపింగ్ కేస్…భుజంగరావు, తిరుపతన్న బెయిల్‌ పిటిషన్ల తిరస్కరన

-

తెలంగాణ స్టేట్ పాలిటిక్స్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.ఈ ఫోన్ టాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై మంగళవారము నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్లపై వాదనలు కొనసాగాయి. అయితే ఫోన్ ట్యాపింగ్‌ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అడిషినల్‌ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకి తెలిపారు. ఛార్జిషీట్‌ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్‌ మంజూరు చేయొద్దని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టును కోరారు. బెయిల్‌ పిటిషన్లపై మంగళవారమే వాదనలు పూర్తికాగా.. ఈ పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news