T20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు ఇండియా, USA మ్యాచ్ జరుగుతుంది. ఇందులో విజేత సూపర్8కు చేరుతుంది. ఓడిన జట్టు మరో మ్యాచ్ ఆడి గెలిస్తే సూపర్ కు వెళుతుంది. లేకపోతే పాకిస్థాన్ కు అవకాశం వస్తుంది. అయితే పాక్ ఐర్లాండ్ పై గెలవాలి. కాగా భారత్ కంటే USA బలహీనమైంది కావడంతో ఈ మ్యాచ్లో ఆ జట్టు ఓడి, తర్వాతి మ్యాచ్లోనూ ఓడాలని పాక్ కోరుకునే ఛాన్స్ ఉంది. అలా జరిగితే పాకిస్తాన్ కు సూపర్ 8 అవకాశం ఉంటుంది.
ఒకవేళ నేటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే.. పాకిస్థాన్ నేరుగా ఎలిమినేట్ అవుతుంది. ఎందుకంటే ఇండియా ,అమెరికాకు చెరో పాయింట్ దక్కుతుంది. అప్పుడు అవి 5 పాయింట్లకు చేరుతాయి. పాక్ తర్వాత మ్యాచ్‌లో గెలిచినా.. 4 పాయింట్ల వద్దే ఉంటుంది.