కన్నీళ్లు పెట్టిస్తున్న ఫోటో… తల్లి ప్రేమ అంటే ఇదే…

-

ఈ భూమి మీద తల్లి ప్రేమను మించింది ఏముంటుంది చెప్పండి…? ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా చివరకు తన ప్రాణం పోతున్నా సరే తల్లి తన పిల్లల కోసం తపిస్తూ ఉంటుంది. అందుకోసం ప్రాణాలు పణంగా పెడుతుంది ఆ తల్లి. తాజాగా వైరల్ అవుతున్న ఒక ఫోటో చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా హైదరాబాద్- నర్సాపూర్ హైవేలో ఎక్కువగా అడవులు ఉన్నాయి.

రోడ్డు పక్కన వేలాది కోతులు ఆహారం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాయి. అక్కడ వాహనాలు వెళ్తూ ఉంటే వాటిల్లో నుంచి ఆహరం వస్తుందేమో అని చూస్తాయి. ఈ క్రమంలోనే ఒక వానరం ప్రమాదానికి గురైంది. ప్రమాదం ఎలా జరిగింది అనేది తెలియకపోయినా ఆ కోతి కుడి వైపు మాత్రం తీవ్ర గాయ౦ అయింది. దీనితో ఎక్కువగా రక్తం కారుతుంది. తీవ్ర రక్త స్రావం జరుగుతున్నా సరే ఆ కోతి తన బిడ్డను మరవలేదు.

ఆకలితో ఉన్న తన పిల్లకు పాలు ఇస్తుంది. ఈ ఫోటోని ఒక వాహనదారుడు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ కోతిని మీరు చూస్తే కన్నీరు పెట్టడం ఖాయ౦. అంత రక్తం కారుతున్నా సరే ఆ కోతి తన తల్లి ప్రేమను మరవకుండా పాలు ఇస్తుంది. ఈ ఫోటో చూసి పలువురు కన్నీరు పెడుతున్నారు. తల్లి ప్రేమ అనేది ఈ సృష్టిలో ఒక వరం అని అది ఎక్కడా దొరకదని కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news