ముద్దు సీన్ కోసం దర్శకుడు ఎం చేసాడో తెలుసా…?

-

ఈ రోజుల్లో సినిమాల్లో లిప్ లాక్ అనేది సర్వ సాధారణం అయింది. ఈ విషయం అందరికి అర్ధమవుతుంది కూడా. సినిమాలో ఆ సీన్ లేకపోతే మనకి కూడా బోరింగ్ ఏ కదా…? అందుకే దర్శక నిర్మాతలు ఎక్కువగా కథలో లిప్ లాక్ ఉండే విధంగా జాగ్రత్త పడుతూ, బాబోయ్ అసలు సీన్లే దాని కోసం రాస్తున్నారు. ముద్దు సీన్ ఉంటే సినిమా వసూళ్లు కూడా భారీగా రావడంతో నిర్మాతలకు కూడా తప్పడం లేదు అనుకోండి.

నటుల విషయానికి వస్తే గతంలో కాస్త అలా నటించడానికి ఇబ్బంది పడే వాళ్ళు గాని ఇప్పుడు అలాంటిది ఎం ఉండటం లేదు గా. చక్కగా స్వేచ్చగా నటించేస్తున్నారులెండి. ప్రస్తుతం భారతీయ సినిమాలో ఇది ఎక్కువగా ఉంది. అదలా ఉంటే, ప్రస్తుతం బాలివుడ్ లో దిశా పటాని, ఆదిత్యరాయ్ కపూర్, అనీల్ కపూర్ ప్రధాన పాత్రల్లో మలంగ్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా విడుదలకు కూడా సిద్దంగా ఉంది.

త్వరలో ప్రేక్షకుల ముందుకి వస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక పోస్టర్ విడుదల చేసారు. ఈ పోస్టర్ లో ఆదిత్య రాయ్‌ కపూర్‌ భూజాల మీద కూర్చున్న దిశ అతడి లిప్‌ లాక్‌ చేస్తున్నట్టుగా ఉంది. ఇక ఈ సినిమాలో మరిన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయట. కొన్ని సీన్ల కోసం హీరో హీరోయిన్లకు రెండు రోజుల పాటు దర్శకుడు ట్రైనింగ్ ఇచ్చారట. ఒక నిమిషం సీన్ కోసం అయితే దిశా, ఆదిత్య చాలా కష్టపడ్డారట.

Read more RELATED
Recommended to you

Latest news