తమిళ నాడు లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం లో సీడీఎస్ బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య తో సహా మొత్తం 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కాగ సీడీఎస్ బిపిన్ రావత్ దంపతుల తో పాటు ఆర్మీ అధికారుల భౌతిక కాయాలు ఢిల్లీ కి చేరుకున్నాయి. ఢిల్లీ లో ని పాలం విమానాశ్రయం లో ప్రస్తుతం ఆర్మీ అధికారలు, నేవీ అధికారలు వారి కి నివాళ్లు అర్పిస్తున్నారు. అలాగే రాత్రి 9 గంటల కు ప్రధాని మోడీ, 9 :15 గంటల రాష్ట్రపతి నివాళ్లు అర్పిస్తారు.
కాగ రేపు ఉదమం 11 గంటల నుంచి సీడీఎస్ బిపిన్ రావత్ దంపతుల భౌతిక కాయాలను ప్రజల సందర్శన కు ఉంచ నున్నారు. అలాగే 12:30 గంటల నుంచి సైనికాధికారుల సందర్శన కు అనుమతి ఉంటుంది. అలాగే రేపు మధ్యాహ్నం 2 గంటల కు ఢిల్లీ లో ని కామరాజ్ మార్గ్ నుంచి వీరి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది. కంటోన్మెంట్ లో ని బ్రార్ స్క్వేర్ స్మశన వాటిక లో సైనిక లాంఛనాలతో బిపిన్ రావత్ దంపతుల అంత్య క్రియలు జరగనున్నాయి.