బింబిసార సినిమా కోసం అలా మారిన కళ్యాణ్‌ రామ్..ఫోటోలు వైరల్‌

-

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం బింబిసార. ఆగస్ట్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సినిమా జయపజయాలతో సంబంధం లేకుండా డిఫరెంట్ సినిమాలు చేయడంలో ఎప్పుడూ ఆసక్తి చూపించగలరు.

ఈసారి కూడా సరికొత్తగా బింబిసారుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించడానికి ఒక సినిమాతో మళ్లీ మన ముందుకు రావడం జరిగింది. అంతే కాకుండా అద్భుతమైన సినిమాలను తెరకెక్కించే నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ అంచనాలను భారీగా పెంచేసింది. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా కోసం కళ్యాణ్‌ రామ్‌ తన గెటప్‌ మార్చుకున్నట్లు తెలుస్తోంది. బొద్దుగా ఉన్న కళ్యాణ్‌.. జిమ్‌ బాడీగా మారారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news