Fact Check : మీ వాట్సాప్ చాట్ ను ప్రభుత్వం చదువుతోందా.. కేంద్రం క్లారిటీ

-

వాట్సాప్ లో అప్పుడప్పుడు నకిలీ వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. కానీ ఇప్పుడు ఏకంగా వాట్సాప్ పైనే వాట్సాప్ లో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ అదేంటంటే.. వాట్సాప్ చాటింగ్ లను ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని. అంటే మన చాట్ లను సర్కార్ చదివేస్తోందట. దీనికోసం నూతన మార్గదర్శకాలు జారీ చేసిందని సమాచారాం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర సమాచార శాఖలోని పీఐబీ విభాగం దీనిపై క్లారిటీ ఇచ్చింది.

వాట్సాప్ చాట్ ను ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త నకిలీ అని పీఐబీ స్పష్టం చేసింది. అలాంటి మార్గదర్శకాలేం కేంద్రం విడుదల చేయలేదని క్లారిటీ ఇచ్చింది.

‘వాట్సాప్‌లో మెసేజ్‌ పంపిస్తే ఒక టిక్‌ గుర్తు, అవతలివారికి చేరితే రెండు టిక్‌లు, 2 బ్లూకలర్‌ టిక్‌లు ఉంటే మెసేజ్‌ చదివారని.. మూడు బ్లూ టిక్‌ గుర్తులు ఉంటే ప్రభుత్వం వాటిని గమనించిందని.. రెండు బ్లూ, ఒక రెడ్‌ టిక్‌ మార్క్‌ ఉంటే ప్రభుత్వం మీపై చర్యలు తీసుకోనుందని.. అదే ఒకటి బ్లూ, రెండు రెడ్‌ టిక్‌లు ఉంటే మీ సమాచారాన్ని ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని.. మూడు రెడ్‌ కలర్‌లో ఉంటే ప్రభుత్వం మీపై చర్యలకు ఉపక్రమించిందని, వీటికి సంబంధించి త్వరలోనే మీకు కోర్టు నుంచి సమన్లు జారీ అవుతాయి’ అని పేర్కొంటూ ఒక మెసేజ్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇదిలాఉంటే, వాట్సాప్‌లో ఇటువంటి మెసేజ్‌లపై ‘మెటా’ సంస్థ ఇప్పటికే పలుసార్లు క్లారిటీ ఇచ్చింది. వాట్సాప్‌లో మెసేజ్‌లు పూర్తి సురక్షితమని.. వారిని ఎవ్వరూ చదవలేరని స్పష్టం చేసింది. అంతేకాకుండా వాట్సాప్‌ సంస్థ కూడా వాటిని చదివే ఆస్కారం లేదని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news