తూర్పుగోదావరి జిల్లాకి చెందిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి సత్యనారాయణమ్మ ఈరోజు మృతి చెందారు. కొద్దిరోజులుగా బ్రెయిన్ స్ట్రోక్ తో హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. అయితే ఆమె భౌతికకాయాన్ని పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లి సుబాష్ చంద్రబోస్ కు వైసీపీ నేతలు సానుభూతిని వ్యక్తం చేశారు.
ఆమె మరణ వార్త తెలుసుకున్న సిఎం వైఎస్ జగన్ కూడా పిల్లి సుభాష్ కి ఫోన్ చేసి పరామర్శించారు. సోమవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారని అంటున్నారు. విషయం తెలుసుకున్న పిల్లి సుభాష్ అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పిల్లి జగన్ ఆశీసులతో ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత శాసన మండలి రద్దు చేస్తూ సిఎం జగన్ నిర్ణయం తీసుకోవడంతో ఆయనను రాజ్యసభకు పంపారు జగన్.