కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలో మంత్రి వర్గ బెర్త్‌లు ఖాళీ అయ్యాయి. ఇద్దరు మంత్రులు అనారోగ్య కారణంగా మృతి చెందారు. దీంతో ఆయా పోస్టులను భర్తీ చేయాలి. అదేసమయంలో ప్రభుత్వానికి ఇరకాటంగా మారిన ఆర్థిక శాఖను కూడా ప్రక్షాళన చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంటే.. ప్రస్తుతం మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్‌ను ఆ పదవి నుంచి తప్పించి వేరేది ఇస్తారనే ప్రచారం జాతీయ మీడియాలో జోరుగా సాగుతోంది.
ఆమె ఆర్థిక మంత్రిగా ప్రజలతో మంచి మార్కులు వేయించుకోలేక పోతున్నారని, ఆమె తీసుకువచ్చిన పథకాలు, జీఎస్టీ బకాయిలు ఇవ్వకపోవడం, రాష్ట్రాలు అప్పులు చేసుకోవాలని సూచించడం, నిరుద్యోగం పెరిగిపోవడం, కరోనాను సమర్ధంగా ఎదుర్కొనేలా నిధులు ఇవ్వకపోవడంపై రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయని అందుకే ఆమెను మార్చేందుకు మోడీ రెడీ అయ్యారని అంటున్నారు. దీంతో ఆమెను మార్చడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి, కానీ వాస్తవం ఇది కాదని, ఆర్థిక మంత్రిగా ఎవరు ఎక్కడ ఉన్నా.. వారంతా అధినేతల కనుసన్నల్లోనే పనిచేస్తారని అంటున్నారు విశ్లేషకులు
అంటే.. దేశంలో ఆర్థిక వ్యవస్థను నడిపించేది ఆర్థిక మంత్రి అన్నా.. ప్రధానిగా మోడీ పగ్గాలు చేపట్టాక అంతా ఆయన కనుసన్నల్లోనే జరుగుతోందనేది విశ్లేషకులు, ఆర్థికరంగాల నిపుణుల మాట. ఇప్పుడు ఇది విఫలమైంది. దీంతో మొత్తం పరిణామాలను నిర్మలపైకి నెట్టి.. ఆమెను బూచిగా చూపించి.. మంత్రి వర్గం నుంచి తప్పించి.. తానుసేఫ్ అయ్యేందుకు ప్రధాని మోడీ పావులు కదుపుతున్నారని అంటున్నారు.
జీఎస్టీ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాన్నే నిర్మల నోటి నుంచి చెప్పారు తప్ప ఆమె ప్రమేయం ఏమీలేదని, అదేవిధంగా ఇతర విషయాలు కూడా మోడీ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని కానీ, ఆమెను మాత్రం బలి చేస్తున్నారు వీరు చెబుతున్నారు. ఏదేమైనా.. మోడీ ఆడిస్తున్న నిర్మల నాటకానికి మార్కులు పడకపోతే..ఆమెను బలి చేయడం బాధాకరమని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
-Vuyyuru Subhash