బొగ్గు బ్లాకుల వేలంతో రూ.20వేల కోట్ల ఆదాయం..ఏపీ నుంచి బిడ్లో పాల్గొన్న కంపెనీలు ఇవే!

-

దేశంలో బొగ్గు గనులను వేలం వేయడానికి కేంద్రం వేగం పెంచింది..వాణిజ్య బొగ్గు గనులను వేలం వేయడం ద్వారా ఎక్కువ ఆదాయం రాబట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది..వాణిజ్య మైనింగ్ కోసం బొగ్గు బ్లాకులను వేలం వేయడం వల్ల భారీగా ఆదాయం వస్తుందని బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు..గనుల వేలంతో సంవత్సరానికి రూ .20,000 కోట్ల ఆదాయం వస్తుందని వాణిజ్య మైనింగ్ కోసం 38 బొగ్గు బ్లాకులను వేలం వేసే ప్రక్రియ జరుగుతోందన్నారు.
బొగ్గు బ్లాకుల వేలంతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో దాదాపు 2.8 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయన్నారు..వేలంలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, అరబిందో రియాలిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మరియు ఇమిల్ మైన్స్ అండ్ మినరల్స్ రిసోర్సెస్ ఒక్కొక్కటి నాలుగు బిడ్లను సమర్పించాయి…వేదాంత లిమిటెడ్ మూడు బిడ్లను సమర్పించింది, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జెఎస్పిఎల్) రెండు, జెఎస్డబ్ల్యు స్టీల్ మరియు నాల్కో ఒక్కొక్కటి సమర్పించింది..19 బొగ్గు గనులకు రెండు లేదా అంతకంటే ఎక్కువ బిడ్లు వచ్చాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news