కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి..?

-

ఆంధ్రప్రదేశ్ లోని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి విషయంలో ఈసీ కాస్త సీరియస్ గా ఉంది. అతి త్వరలోనే ఆయనను అరెస్ట్ చేసి తీరుతామని సీఈవో ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. మాచర్ల పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో సరైన సమాచారం ఇవ్వనందుకు విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్ చేయాలని కూడా ఆదేశాలిచ్చారు సీఈవో. పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు ఎస్పీ, డీఎస్పీలతో 8 పోలీస్ బృందాలు పని చేస్తున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే.. గుంటూరు జిల్లా నరసారావుపేట కోర్టు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పరారీలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి నరసరావుపేట కోర్టులో లొంగిపోతారని వార్తలు వినిపిస్తున్నాయి.  అక్కడికి భారీగా జనం చేరుకుంటున్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఈ వార్తకు బలం చేకూరుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news