ఒయాసిస్సులా కనిపిస్తున్న దివ్యౌషధం ప్లాస్మా థెరపీ..!

-

కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఈ మహమ్మారి బారిన పడి చాల మంది ప్రాణాలు పోగుట్టుకుంటున్నారు. ఇంకా కరోనా వైరస్ కి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూనే ఉన్నారు. అయితే కరోనా వైరస్ కి వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ క్లిష్ట సమయంలో ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తున్న దివ్యౌషధం ప్లాస్మా థెరపీ. ప్రస్తుతం కొవిడ్‌-19 చికిత్సల్లో ప్లాస్మా థెరపీ ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది.

coronavirus
coronavirus

తాజాగా హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ దవాఖానలో ప్లాస్మాబ్యాంకును ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో ప్లాస్మా బ్యాంకులు ఏర్పాటుపై చర్చ జరుగుతుంది. తెలంగాణలో రికవరీ రేటు పెరుగుతున్నాయి. అయితే భారత వైద్య పరిశోధన మండలి ప్లాస్మా థెరపీకి అనుమతులను సులభతరం చేశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు కార్పొరేట్‌ దవాఖానల్లో ఈ చికిత్స అందుబాటులోకి వచ్చింది. ఈ థెరపీతో రోగులు కోలుకుంటుండటంతో రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతుంది.
 
ఏ వ్యాధి నుండి కోలుకున్న వ్యక్తి రక్తం నుంచి ప్లాస్మా తీసి.. మరో రోగి రక్తలో ఉన్న వైరస్‌ను అంతం చేయడమే ప్లాస్మా థెరపీ లక్ష్యం. ఆ వ్యాధి సోకి కోలుకున్న వ్యక్తి నుంచి రక్తాన్ని సేకరించి ప్లాస్మాను వేరు చేసి భద్రపరుస్తారు. ఈ ప్లాస్మా కణాలను వ్యాధి సోకిన మరో వ్యక్తికి ఎక్కిస్తారు. వైరస్‌ సోకి కోలుకున్న మనిషి శరీరంలో అదే వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీస్‌ ఉత్పత్తి అవుతాయి. ఇవి ఆ వైరస్‌ తిరిగి ప్రవేశించకుండా నిరోధిస్తాయని నిపుణులు తెలియజేశారు.
 
ప్రస్తుతం కరోనా సోకిన తర్వాత ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకొని తిరిగి 14 రోజుల వరకు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకపోతే ఆ వ్యక్తి ప్లాస్మా దానం చేయవచ్చును. ఎక్కువ శాతం 28 రోజుల తర్వాతనే ప్లాస్మా సేకరిస్తున్నారు. అర్హులైన దాతలు ప్రతి రెండు వారాలకు 500 మిల్లీలీటర్ల ప్లాస్మాను దానం చేయవచ్చు. ఇలా సేకరించిన ప్లాస్మాను అతి శీతల వాతావరణంలో కనీసం సంవత్సరం దాకా భద్రపరవచ్చును. ప్లాస్మా బ్యాంకు ఏర్పాటు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక వ్యక్తి ప్లాస్మాను ప్రతి 14 రోజులకు ఒకసారి 500 మిల్లీలీటర్ల వరకుదానం చేయొచ్చని, ఏటా 24 సార్ల కన్నా ఎక్కువ దానం చేయొద్దని వైద్య నిపుణులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news