కిసాన్ యోజన 13వ విడత డబ్బులు.. లిస్ట్ లో మీ పేరు ని ఇలా చెక్ చెయ్యండి..!

-

కేంద్రం రైతుల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వీటి వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటోంది. రైతుల కోసం కేంద్రం కిసాన్ యోజన స్కీమ్ ని తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ వలన రైతులకి ఎంతో ప్లస్ అవుతోంది. రైతులకు మూడు విడతలుగా ఏటా 6 వేల రూపాయలు ఈ స్కీమ్ ద్వారా ఇస్తున్నారు.

farmers

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కింద 12 విడతలు డబ్బులు ఇచ్చారు. 13వ విడత డబ్బులు అయితే ఇంకా రాలేదు. మీ పేరు లిస్ట్ లో ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు. 13వ విడత ఇంకా రాలేదు. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ లబ్ధిదారులైతే మీకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏటా 6 వేల రూపాయలను ఇస్తుంది. పీఎం కిసాన్ యోజన కింద 13వ విడత డబ్బులు అర్హులు కి మాత్రం ఇస్తారు. అయితే వాళ్ళు కెవైసి ప్రక్రియ ని పూర్తి చేసుకోవాల్సి వుంది. రూ. 2000 మీ ఖాతాలోకి వస్తాయో లేదో ఇలా చూడచ్చు.

ఇలా స్టేటస్ ని చెక్ చేసుకోండి:

రూ. 2000 మీ ఖాతాలోకి వస్తాయా లేదా అనేది ఇలా చూడచ్చు.
ముందు మీరు వెబ్ సైట్ లోకి వెళ్ళండి.
ఫార్మర్స్ కార్నెర్ లోకి వెళ్ళండి.
ఇక్కడ బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయండి.
మీ మొబైల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ని కూడా ఇవ్వాలి.
క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి.
ఇక్కడ మీరు స్టేటస్ ని చూడచ్చు.
స్టేటస్‌లో YES అని రాస్తే మీకు డబ్బు వస్తుంది.
అదే మీకు NO అని రాస్తే డబ్బులు రావు.

 

Read more RELATED
Recommended to you

Latest news